Special Programs
🙏ఓం శ్రీ సాయిరాం 🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... 9/8/2026 ఆదివారం నాడు తమ ఖమ్మం జిల్లా పర్యటన లో భాగంగా మన విశిష్ఠ అతిథులు శ్రీ C రోమెల్ గారు, శ్రీ MRK ప్రసాద్ గారు, శ్రీ మధుసూదన్ రెడ్డి గారు శ్రీ వెంకటరమణ రెడ్డి గారు శ్రీ భార్గవ్ గారు జిల్లా లోని వైరా సమితి మరియు ఖమ్మం సమితి లో పర్యటించారు. వైరా లో వేద పండితులు స్వాగతం పలికారు. గోశాల మరియు వేద పాఠశాల సందర్శించారు. వేద విద్యార్థులతో మమేకం అయ్యారు. ప్రేమతరు కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటారు. అటుపిమ్మట ఖమ్మం సమితి ఖమ్మం పట్టణం లో ఈశ్వరాంబ వృద్ధ మహిళా ఆశ్రమం సందర్శించి ఆశ్రమవాసులతో ప్రేమగా గడిపారు. తదనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం లో రోగుల సహాయకులు కొరకు నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా కేంద్రము సందర్శించి, నిర్వహణ తీరు తెన్నులు పరిశీలించి అన్న ప్రసాద సేవ లో పాల్గొన్నారు.. తరువాత ఖమ్మం శ్రీనివాసనగర్ లోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరo సందర్శించి భక్తుల నుద్దేశించి మాట్లాడారు. తమ సత్సంగం లో అనేక విషయాలు తెలిపారు., స్వామి వారికి మంగళహారతి సమర్పించారు. మందిరం ప్రాంగణం లోని శ్రీ సత్యసాయి ఉచిత వైద్య శాల కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఖమ్మం జిల్లా అద్యక్షులు, ఖమ్మం మరియు వైరా సమితి కన్వీనర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, యాక్టివ్ సభ్యులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా