Ceiling on Desires


“తన కోర్కెలను అదుపులో ఉంచుకోవడమే నిజమైన పొదుపు “ బాబా

ఒక వస్తువును కోరుకొని దాని గురించి ఆలోచించడం, అనురాగం పెంచుకోవడం, అది నెరవేరితే సంతోషం, విఫలమైతే దుఃఖం దానివలన క్రోధం, యుక్తాయుక్త విచక్షణ కోల్పోవడం, ఆవేశం, అనరాని మాటలు, చేయరాని పనులు, ఐకమత్యానికి విఘాతం.

 

పుట్టినప్పుడు అమృతపుత్రులైయుండిరి. పిదప లోకవిషయము చేరి విషయవాంఛ చేత విషతుల్యులైరి. సకలశ్రుతులమాట సాయి మాట.

 

కోర్కెలకు కళ్ళెం వేసి పరిమితులు విధుంచుకోకపోతే అధోగతి తప్పదు.  త్యాగమే సాయి భక్తులకు లక్ష్యం కావాలి. కోర్కెల అదుపుతో త్యాగం అభివృద్ధిగాంచడం తధ్యం. కోర్కెలపై అదుపుచేసి పొదుపుతో త్యాగభవాన్ని పెంచడం మూడు పద్దతులలో ఆచరించవచ్చును.

 

భౌతికస్థాయిలో శరీర సంబంధమైన అలవాట్లు, ఆహారం, దుస్తులు అదుపుచేయడమువలన ఖర్చులు తగ్గును.  పనికిరాని వస్తువులు కొని నింపడమువలన దుబారా అగును. అవసరానికి మించి దేనినైనా మనవద్ద ఉంచితే అది దొంగతనంతో సమానం. తినడం, త్రాగడం, డబ్బు, నీరు, విధ్యుచ్చక్తి, వృధా సమాజ ద్రోహం క్రింద వస్తుంది.అతిబాష మతి హాని అన్నారు.  మాటను అదుపులో ఉంచితే విరోధాన్ని నిగ్రహించవచ్చును.

 

మానసికస్థాయిలో మనస్సులోని దురాలోచనలు, దుష్ట సంకల్పాలు , చెడుపనులు ఆచరణలోనికి వస్తే అపార్ధాలు, అనార్ధాలు వస్తాయి.  మనస్సే మోక్షానికి మార్గం.

 

మనుమోవ మనుష్యారాం కారణం బంధమోక్షయో అన్నారు. మనస్సును అదుపులో ఉంచితే ప్రశాంతజీవనం వస్తుంది. 

 

ఆధ్యాత్మిక స్థాయిలో ప్రతిజీవిలోనూ భగవంతుడున్నాడు అనే ఏకాత్మభావం ప్రకృతి సంపద అందరికీ అండాలి. అది ఎవరూ తమ స్వార్ధానికి వుంచుకోరాదు. ఇచ్చుకొనుము సేవ పుచ్చుకొనుము ప్రేమ అన్నారు స్వామి. ఇవ్వడం పరార్ధం, దాచుకోవడం స్వార్ధం.

 

కోరికలను అదుపుచేసి తద్వారా పొదుపుచేసి సమాజాసేవకు ఉపయోగించాలి. అదే త్యాగభావనకు తద్వారా మోక్షానికి దారితీస్తుంది.