Workshops & Conferences
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారి మరియు జిల్లా అధ్యక్షుల వారి సూచన మేరకు 26/7/2026 ఉదయం 10.30 గంటలనుండి మధ్యాహ్నం 2-00 గంటలవరకు భజన వర్క్ షాప్ ఖమ్మం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో జిల్లాలోని అన్ని సమితుల భాగస్వామ్యంతో నిర్వహించుకోవడం జరిగినది ఈ కార్యక్రమములో భజన పాటలు పాడుటలో మెళుకువలు, మనం తప్పు పాడకుండా సరిచేసుకునే విధానం గురించి పుట్టపర్తిలో అనేక సార్లు పర్తి యాత్రలలో పాటలు పాడి స్వామి వారి ఆశీస్సులు పొందిన సాయి సేవక్ అరుణ్ చాలా చక్కగా వివరించారు.తదుపరి కంజర ,డోలక్ సులువుగా అర్థము చేసుకుని నేర్చుకునే మెళకువలు మన సాయి కుటుంబ సభ్యుడు సాయి చరణ్ అమృత్ చాలా చక్కగా వివరించటం జరిగింది .తదుపరి వేదం ,దాని ప్రాముఖ్యత ,భజనకు ముందు మనం వేదం ఎందుకు చదవాలి అనే విషయం వేదం పి.ఆర్.పి. గా ఉన్న శ్రీమతి జి.విజయలక్ష్మి గారు చాలా చక్కగా వివరించారు. అలాగే బ్యాక్ టు బేసిక్స్ గురించి పూర్వ జిల్లా ఆధ్యాత్మిక సమన్వయ కర్త శ్రీ ఆదినారాయణ గారు వివరించారు. చివరిగా పుట్టపర్తి నుండి ఈరోజు మందిరమునకు విచ్చేసిన ప్రముఖ ప్రవచన కర్త శ్రీ అన్నజీరావు గారు నామం యొక్క ప్రాముఖ్యతను, భజన అనగా భగవంతునితో సంభాషించటము అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు .. సాయిరాం. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు , ఖమ్మం జిల్లా