Bhajans
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 26/7/2026 ఆదివారం సాయంత్రం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో జరిగిన భజన అనంతరం ఖమ్మం సమితి కన్వీనర్ గా జిల్లా అధ్యక్షుల వారిచే నామినేట్ చేయబడిన శ్రీ కొదుమూరు.వెంకటేశ్వర్లు గారు సమితి కన్వీనర్ గా స్వామి వారి సన్నిధిలో బాధ్యతలు స్వీకరించి సమితిలో నూతనముగా నామినేట్ చేయబడిన కార్యవర్గ సభ్యులందరికీ బాధ్యతల స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగినది. జిల్లా అధ్యక్షుల వారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్త కార్యవర్గాన్ని అభినందించి , సంస్థ లో వారు నిర్వహించవలసిన విధి విథానముల గురించి వివరించారు. చివరిగా స్వామి వారికి మంగళ హారతి సమర్పించుటతో కార్యక్రమం ముగిసినది. ఖమ్మం సమితి నూతన కార్యవర్గం- ఖమ్మం సమితి కన్వీనర్: శ్రీ కొదుమురు వెంకటేశ్వర్లు సేవాదళ్ సమన్వయ కర్త - శ్రీ పార్ధసారధి ( మెడికల్ కృష్ణ ) సేవాదళ్ మహిళా సమన్వయ కర్త - శ్రీమతి పద్మావతి ఆధ్యాత్మిక సమన్వయ కర్త - శ్రీ తాళ్లూరి వెంకటేశ్వరారావు విద్యావిభాగ సమన్వయ కర్త -శ్రీ వెంకటకృష్ణ విద్యావిభాగ్ మహిళా సమన్వయ కర్త - శ్రీమతి దీపిక యువజన విభాగ సమన్వయ కర్త - శ్రీ సంతోష్ కుమార్ యువజన విభాగ మహిళా సమన్వయ కర్త - శ్రీమతి ప్రశాంతి . అందరికి స్వామి వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ... సాయిరాం🙏