District / State Meetings
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... 19/7/2026 ఆదివారం ఉదయం 10-00 గంటల నుండి నేలకొండపల్లి శ్రీ సత్యసాయి మందిరం ప్రాంగణంలో నూతన జిల్లా అద్యక్షులచే తొలి జిల్లా సమీక్షా సమావేశము నిర్వహించబడింది. ఈ సమావేశానికి శ్రీ దమ్మాలపాటి సుధాకరరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ మరియు ఆశీస్సులతో జిల్లా అద్యక్షులు నూతనంగా జిల్లా కోఆర్డినేటర్లను, ఖమ్మం, మధిర, జక్కెపల్లి,గొల్లపూడి సమితి కన్వీనర్లను నూతనంగా నామినేట్ చేయుట జరిగింది. యాక్టివిటీ ఇన్చార్జెస్ కొందరిని నామినేట్ చేయుట జరిగింది. నూతనంగా నామినేట్ చేయబడిన వారు స్వామి వారి సన్నిధిలో బాధ్యతలు స్వీకరించుట జరిగింది. జిల్లా అధ్యక్షుల వారు సంస్థ శాశ్వత లక్ష్యములు , విశిష్టత వివరంగా తెలియజేశారు.. జిల్లా కార్యవర్గ సభ్యులకు, సమితి కన్వీనర్లకు, బాధ్యులకు, విధులు నిర్వహణపై పలు సూచనలు ఇచ్చారు. ఈ విషయమై స్వామి వారి సందేశాలను అందించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ డి సుధాకర రావు గారు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు గురించి, సంస్థ పురోగతికొరకు తీసుకోవలసిన చర్యలు గురించి, బాలవికాస్ ప్రాధాన్యత గురించి సవివరంగా తెలిపారు. స్వామి వారికి హారతి సమర్పణ తో కార్యక్రమం ముగిసింది. సాయిరాం🙏 జిల్లా అద్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా