Special Programs
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా ***** భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... జిల్లా అద్యక్షులు గరికపాడు భజన మండలి సందర్శన 24/7/2026 🌻🌻 గత 20 సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలకు నెలవైన గరికపాడు భజన మండలి, గరికపాడు గ్రామంలో శ్రీ సత్యసాయి సేవానిలయం నిర్మాణం కొరకు 23/10/2025 తేదీన సుముహూర్తంలో భూమిపూజ వేద పండితులచే ఘనంగా జరిగిన విషయం మన అందరికి విదితమే. ఈరోజు మందిరం నిర్మాణ pillar/column footing వేస్తున్న సందర్బంగా ఖమ్మం జిల్లా అద్యక్షులు జిల్లా సర్వీసు కోఆర్డినేటర్ మరియు జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ లతో కలిసి వైరా సమితి కన్వీనర్ యుక్తంగా మందిర నిర్మాణ పనులు సందర్శించుట జరిగింది. అనంతరం వైరా వేద పాఠశాల సందర్శించి గురువు గారితో, విద్యార్థులతో జరిగిన సమావేశం లో వివరాలు తెలుసుకొని పిల్లలను శ్రద్ధగా చదువుకోవాలని.. స్వామి, సంస్థ వారికి అన్నివిధాలా అండగా ఉంటుందని పిల్లలకు తెలియజేయుట జరిగింది ...తదుపరి గోశాల లోని గోవులను దర్శించుకొని ఇంచార్జి నాగరాజు గారిని అన్ని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు , ఖమ్మం జిల్లా తెలంగాణ