Special Programs
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ఈరోజు ఉదయము నిర్వహించబడే ప్రేమతరు మొక్కలు నాటే కార్యక్రమములో భాగముగా, ఖమ్మం జిల్లా ,ఖమ్మం సమితి పరిధిలోని నాగులవంచ గ్రామములో కొత్తగా నిర్మించు కొబేయే శ్రీ సత్యసాయి ప్రేమామృత విద్యానికేతన్ ప్రాంగణము లో యువజన విభాగం వారి ఆధ్వర్యములో ప్రేమతరు కార్యక్రమము నిర్వహించబడినది.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా నామవరం మార్కెట్ చైర్మన్ గారు శ్రీ అంబటి.వెంకటేశ్వరరావు గారు, సీతంపేట గ్రామ పెద్దలు శ్రీ ఆళ్ల.పానకాలరావు గారు మరియు సమీప గ్రామ పెద్దలు పాల్గొన్నారు .తొలుత నామవరం మార్కెట్ చైర్మన్ శ్రీ అంబటి.వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా మొదటి మొక్కను నాటించి కార్యక్రమము ప్రారంభించబడింది. ఈ మహత్తర సేవా కార్యక్రమములో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దమ్మాలపాటి.సుధాకర రావు గారు, జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి బాధ్యులు ,గ్రామ పెద్దలు మరియు మహిళలు ,యూత్ సభ్యులు అందరూ సేవలో భాగస్వామ్యులు అయి స్వామి వారి ఆశీస్సులు పొందారు