Special Programs
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా తెలంగాణ 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... ఖమ్మం సమితి, నేరెడ భజన మండలి, నేరడ గ్రామం లో 27/6/2026 న జరిగిన మొహర్రం పండుగ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఖమ్మం జిల్లా అద్యక్షులు పాల్గొనటం జరిగింది. న్యాయం కోసం ధర్మం కోసం పోరాడి వీరమరణం పొందిన ఇమాం హుస్సేన్ ఇమాం హసన్ ల త్యాగాలను స్మరిస్తూ జరిగే మొహర్రం పండుగ రోజున నేరడ భజన మండలి కన్వీనర్ తో పాటు జిల్లా అద్యక్షులు ప్రేమతో పాల్గొన్నారు. ముస్లిం సోదరుల నుద్దేశించి మాట్లాడుతూ భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకోవాలని , శాంతి సహనం దయ సేవా భావంతోజీవించాలని , సత్యం న్యాయం కోసం త్యాగం చేయాలని కోరారు. " మతములన్నియు చేరి మంచినే బోధించు.. మతులు మంచివైన మత మేది చెడ్డది వినుడు భారతీయ వీర సుతుడా" అన్న స్వామి వారి సూక్తి గుర్తు చేశారు. వారి వారి మత ధర్మాలు ఆచరిస్తూ ఇతర మతాల ధర్మాలను ఆదరించాలని అప్పుడు మాత్రమే సర్వమత సమానత్వం ఏర్పడి సమాజం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామస్థులు అధిక సంఖ్యలో ప్రేమతో పాల్గొన్నారు సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా