Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌹🌹 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... ఖమ్మం జిల్లా, మధిర సమితి లో ఆయుర్వేద వైద్య సేవలు, విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ సేవలు విస్తృతంగా జరుగుతున్న విషయం విదితమే.. అట్టి సేవలలో భాగంగా 27/6/2026 తేదీన మధిర సమితి, ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో ZP హైస్కూల్ లోని 300 మంది విద్యార్థులకు నోటు బుక్స్ మరియు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయుట జరిగింది. చిన్నపిల్లలకు డ్రెస్సెస్ కూడా పంపిణీ చేయుట జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ , గ్రామ పెద్దలు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మధిర సమితి కన్వీనర్ గారు తదితరులు ప్రేమతో పాల్గొన్నారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా