Special Programs
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ... 🌹 నూతన జిల్లా అద్యక్షులు బాధ్యతల స్వీకరణ🌹 21/6/2026 సాయంత్రం ఖమ్మం పట్టణం లోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. తదనంతరము , ఖమ్మం సమితి కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ ఆలిశ్యం నరసింహారావు గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుల ఉత్తర్వులు మేరకు ఖమ్మం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు గా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ దమ్మాలపాటి సుధాకర రావు గారి నుండి బాధ్యతలు స్వీకరించుట జరిగినది. శ్రీ దమ్మాలపాటి సుధాకరరావు గారు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం మన అందరికి తెలిసిన విషయమే.. నూతన జిల్లా అద్యక్షులు శ్రీ ఆలిస్యం నరసింహా రావు గారికి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విస్తృత సేవలు అందిస్తున్న శ్రీ దమ్మాలపాటి సుధాకరరావు గారికి ఈరోజు స్వామి వారి సన్నిధిలో అభినందన సభ ఏర్పాటు చేయుట జరిగినది. ఈ సభలో పలువురు సాయి కుటుంబ సభ్యులు, పెద్దలు వారి ఇద్దరి సేవలను కొనియాడి వారికి అభినందనలు, శుభాకాంక్షలు ప్రేమతో తెలియచేయుట జరిగినది. శ్రీ A నరసింహారావు గారు జిల్లా అద్యక్షులు, శ్రీ D సుధాకర రావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టిన ప్రతి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తమ అమూల్యమైన సహకారాన్ని సేవలను ప్రేమతో అందిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జై సాయిరాం. 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా