Service
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి సంవత్సరము లాగానే ఈసంవత్సరం కూడా,స్వామి వారి శత జయంతి మహోత్సవముల ను పురస్కరించుకుని ఖమ్మం సత్యసాయి సేవా సమితిని మహిళా విభాగం వారి ఆధ్వర్యములో పాత బస్ స్టాండ్ ఆవరణలో చలివేంద్ర సేవలు ఏప్రియల్ 6 తేదీనుండి నిన్న సాయంత్రం వరకు నిర్వగ్నముగా కొనసాగించబడినవి. మండు వేసవిలో మహిళలు అందరూ చక్కటి సేవలు అందించి స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు పొంది తరించారు. వాతావరణం కొంచం చల్ల బడినందున ఈరోజు ఉదయం 10 గంటలకు స్వామి వారికి మంగళ హారతి సమర్పించి చలివేంద్ర సేవా కార్యక్రమము ను ముగింపు చేయుట జరిగినది. ఈ ముగింపు కార్యక్రమములో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్గొని మహిళందించిన సేవలను కొనియాడినారు.ఈ కార్యక్రమములో జిల్లా కార్యవర్గ సభ్యులు ,సమితి బాధ్యులు, సమితి కార్యవర్గ సభ్యులు,యూత్ సభ్యులు, మరియు సేవలందించిన మహిళలు అందరూ పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు. ఈ కార్యక్రమమును నిర్విఘ్నముగా పూర్తిచేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఈ సేవా కార్యక్రమములో సేవలందించిన మహిళలకు మరియు ఈ కార్యక్రమములో భాగస్వామ్యులు అయిన ప్రతి ఒక్కరికి సంస్థ తరపున ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.