Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సూచనలు మేరకు , స్వామి వారి శత జయంతి వేడుకలు సందర్భంగా, వేసవి తీవ్రత దృష్ట్యా, జరుగుతున్న సేవలో భాగంగా ఈరోజు 9/6/2026 తేదీన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సమితి , ముజ్జుగూడెం గ్రామం లో మండుటెండలో పనిచేసే సుమారు 190 మంది ఉపాధి హామీ కూలీలకు ఉచితంగా మజ్జిగ పంచడం జరిగినది . ఈ సేవా కార్యక్రమంలో జిల్లా జాయింట్ మహిళా కో ఆర్డినేటర్ శ్రీమతి కూచిపూడి శ్రీదేవిగారు, జిల్లా జాయింట్ యూత్ కో ఆర్డినేటర్ చెరుకుపల్లి గోపాల్ రావు గారు, సమితి సభ్యులు శ్రీ కూచిపూడి శ్రీనివాసరావుగారు, లక్ష్మీ గారు, సంధ్యగారు, గ్రామ సర్పంచ్ శ్రీమతి బొడ్డు వసంతగారు, ఉప సర్పంచ్ శ్రీమతి దండా రాణి గారు, ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ బొడ్డు రవీందర్ బాబు గారు, ముజ్జుగూడెం భజనమండలి సభ్యులు శ్రీ కోలేటి రంగయ్య గారు మరియు గ్రామస్థులు ప్రేమతో పాల్గొన్నారు సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా