Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సూచనలు మేరకు , స్వామి వారి శత జయంతి వేడుకలు సందర్భంగా, 100 గ్రామాలలో మండుటెండలో పనిచేసే ఉపాధిహామీ కూలీల దాహార్తి తీర్చేందుకు లక్ష్యంగా జరుగుతున్న సేవలో భాగంగా ఈరోజు 4/6/2026 తేదీన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సమితి , సువర్ణాపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సుమారు 175 మందికి ఉచితంగా మజ్జిగ పంచడం జరిగినది ..ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు కొనియాడారు. తమ పట్ల చూపిన ప్రేమను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ మహిళా కో ఆర్డినేటర్ కూచిపూడి శ్రీదేవిగారు,జిల్లా జాయింట్ యూత్ కో ఆర్డినేటర్ చెరుకుపల్లి గోపాల్ రావు గారు, సమితి కన్వీనర్ శ్రీ గెల్లా వెంకటరమణగుప్తా గారు, గ్రామ సర్పంచ్ శ్రీ పసుపులేటి నాసరయ్య గారు, ఉప సర్పంచ్ జెట్టి అశోక్ గారు, వార్డు మెంబెర్స్ చెరుకూరి వెంకటరామారావుగారు, బొందన ప్రియాంక గారు, చేకూరి నర్సింహా రావు గారు, ఉపాధిహామి పథకం ఫీల్డ్ అసిస్టెంట్ జెట్టి ప్రసాద్ గారు, భజన మండలి కన్వీనర్ శ్రీ నారోజు ఈశ్వరచారి గారు, గ్రామస్థులు పాల్గొన్నారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా