Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సూచనలు మేరకు , స్వామి వారి శత జయంతి వేడుకలు సందర్భంగా, వేసవి తీవ్రత దృష్ట్యా, జరుగుతున్న సేవలో భాగంగా ఈరోజు 5/6/2026 తేదీన ఖమ్మం జిల్లా మధిర సమితి , బంజర గ్రామం లో మండుటెండలో పనిచేసే సుమారు 170 మంది ఉపాధి హామీ కూలీలకు ఉచితంగా మజ్జిగ పంచడం జరిగినది . ఈ సేవా కార్యక్రమంలో , జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ కోనా లక్ష్మీ మోహన రావు గారు, శ్రీ సత్యసాయి రైతు సేవా కోఆర్డినేటర్ శ్రీ కుడుముల వెంకట రామిరెడ్డి గారు, EGS APO శ్రీ నాగరాజు గారు పెద్దలు తదితరులు ప్రేమతో పాల్గొన్నారు సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా