Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సూచనలు మేరకు , స్వామి వారి శత జయంతి వేడుకలు సందర్భంగా, 100 గ్రామాలలో మండుటెండలో పనిచేసే ఉపాధిహామీ కూలీల దాహార్తి తీర్చేందుకు లక్ష్యంగా జరుగుతున్న సేవలో భాగంగా ఈరోజు 5/6/2026 తేదీన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సమితి , కోరట్లగూడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సుమారు 310 మందికి ఉచితంగా మజ్జిగ పంచడం జరిగినది ..ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు కొనియాడారు. తమ పట్ల చూపిన ప్రేమను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ మహిళా కో ఆర్డినేటర్ కూచిపూడి శ్రీదేవి గారు, జిల్లా జాయింట్ యూత్ కో ఆర్డినేటర్ చెరుకుపల్లి గోపాల్ రావు గారు, మేడేపల్లి స్వామి భక్తులు శ్రీ చిలుకూరి వీరబ్రహ్మేంద్ర చారి గారు, సరోజినీ గారు, కొంగర భజన మండలి యూత్ సభ్యుడు చిట్టూరి నరేష్ గారు, గ్రామ ఉప సర్పంచ్ బచ్చలకూరి వెంకట్రావమ్మ గారు గారు, వార్డు మెంబెర్స్ బచ్చలకూరి ఉప్పలమ్మ గారు, రాసంశెట్టి చిట్టెమ్మ గారు, మార్తి రమాదేవి గారు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ బచ్చలకూరి రాంబాబు గారు,స్వామి భక్తులు కొణతల గోవింద రావు గారు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా