Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సూచనలు మేరకు , స్వామి వారి శత జయంతి వేడుకలు సందర్భంగా, 100 గ్రామాలలో మండుటెండలో పనిచేసే ఉపాధిహామీ కూలీల దాహార్తి తీర్చేందుకు లక్ష్యంగా జరుగుతున్న సేవలో భాగంగా ఈరోజు 1/6/2026 తేదీన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సమితి , చెరువుమాధారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సుమారు 287 మందికి ఉచితంగా మజ్జిగ పంచడం జరిగినది ..ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు కొనియాడారు. తమ పట్ల చూపిన ప్రేమను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ కో ఆర్డినేటర్ శ్రీ కె భాస్కర్ రావు గారు, బాల వికాస్ గురు శ్రీమతి కె లక్ష్మీ గారు, సమితి కన్వీనర్ శ్రీ గెల్లా వెంకటరమణగుప్తా గారు, జిల్లా జాయింట్ మహిళా కో ఆర్డినేటర్ శ్రీమతి కె శ్రీదేవి గారు, జిల్లా జాయింట్ యూత్ కో ఆర్డినేటర్ శ్రీ గోపాల్ గారు, సమితి బాధ్యులు శ్రీ. కూచిపూడి శ్రీనివాసరావుగారు, సంధ్యగారు గ్రామ సర్పంచ్ అమరగాని యల్లయ్య గారు, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి షేక్ భాషా గారు, ఉపాధి హామి భాధ్యులు భక్తులు కళ్ళం రాంరెడ్డి గారు, సైదులు గారు పాల్గొన్నారు సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా