Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సూచనలు మేరకు , స్వామి వారి శత జయంతి వేడుకలు సందర్భంగా, 100 గ్రామాలలో మండుటెండలో పనిచేసే ఉపాధిహామీ కూలీల దాహార్తి తీర్చేందుకు లక్ష్యంగా జరుగుతున్న సేవలో భాగంగా ఈరోజు 30/5/2026 తేదీన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సమితి , నాచేపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సుమారు 220 మందికి ఉచితంగా మజ్జిగ పంచడం జరిగినది ..ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు హర్షించారు. తమ పట్ల చూపిన ప్రేమను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ కో ఆర్డినేటర్ శ్రీ కె భాస్కర్ రావు గారు, జిల్లా జాయింట్ మహిళా కో ఆర్డినేటర్ కె శ్రీదేవిగారు, జిల్లా జాయింట్ యూత్ కో ఆర్డినేటర్ గోపాల్ గారు, ట్రస్ట్ సభ్యులు దోసపాటి చంద్రశేఖర్‌రావు గారు, యర్రా నర్సింహా రావు శోభ గారు, మందడి వెంకటేశ్వర రావుగారు, జడ శ్రీనుగారు, సర్పంచ్ భూక్యా మౌనిక నాగేశ్వరావు గారు, ఉప సర్పంచ్ ముండ్రా నాగ ప్రసాద్ గారు, పంచాయతీ కార్యదర్శి పి బాబు రావు గారు, ఫీల్డ్ అసిస్టెంట్ టి ప్రకాష్ గారు తదితరులు ప్రేమతో పాల్గొన్నారు సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా