Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సూచనలు మేరకు , స్వామి వారి శత జయంతి వేడుకలు సందర్భంగా, 100 గ్రామాలలో మండుటెండలో పనిచేసే ఉపాధిహామీ కూలీల దాహార్తి తీర్చేందుకు లక్ష్యంగా జరుగుతున్న సేవలో భాగంగా ఈరోజు 29/5/2026 తేదీన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సమితి రాయిగుడెం భజన మండలి, రాయిగుడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సుమారు 500 మందికి ఉచితంగా మజ్జిగ పంచడం జరిగినది ..ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు హర్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ డి సుధాకర రావు గారు , జిల్లా జాయింట్ సేవాదళ్ కో ఆర్డినేటర్ శ్రీ వంగవీటి కృష్ణమూర్తి గారు, నేలకొండపల్లి సమితి కన్వీనర్ శ్రీ గెల్లా వెంకటరమణగుప్తా గారు,జిల్లా జాయింట్ యువ సమన్వయకర్త గోపాల్ రావు గారు, రాయిగుడెం భజన మండలి కన్వీనర్ శ్రీ తేనె బ్రహ్మయ్యగారు, సమితి భాధ్యులు కూచిపూడి శ్రీనివాసరావుగారు మరియు గ్రామ సర్పంచ్ శ్రీ బోయిన వేణుగారు, ఉపసర్పంచ్ శ్రీ సురేపల్లి ప్రేమ్ కుమార్ గారు ,వార్డు మెంబెర్స్ మేకల మాధవి గారు, డేగల వేణు గారు, తీగ హన్మంత రావు గారు, లింగనబోయిన కొండలు గారు, కాలింగి వీరబాబు గారు, ఉపాధి హామి పథకం బాధ్యులు లింగం వేణు గారు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా