Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సూచనలు మేరకు , స్వామి వారి శత జయంతి వేడుకలు సందర్భంగా, 100 గ్రామాలలో మండుటెండలో పనిచేసే ఉపాధిహామీ కూలీల దాహార్తి తీర్చేందుకు లక్ష్యంగా జరుగుతున్న సేవలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సమితి భైరవునిపల్లి భజన మండలి, భైరవుని పల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సుమారు 200 మందికి ఉచితంగా మజ్జిగ పంచడం జరిగినది ..ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండపనేని లక్ష్మణ్ రావుగారు ఉప సర్పంచ్ ఆలేటి మహేష్ గారు, పంచాయతీ కార్యదర్శి జి రవి గారు, ఫీల్డ్ అసిస్టెంట్ భానోత్ వెంకటేశ్వరరావు గారు మరియు జిల్లా జాయింట్ మహిళా కో ఆర్డినేటర్ కె శ్రీదేవి గారు, జిల్లా జాయింట్ యువ సమన్వయ కర్త గోపాల్ గారు, సమితి బాధ్యులు గోళ్ల శ్రీనివాస్ గారు, కూచిపూడి శ్రీనివాసరావుగారు తదితరులు పాల్గొన్నారు ఇట్టి సేవా కార్యక్రమము రేపు కొంగర గ్రామం లో జరుగనున్నదని జిల్లా జాయింట్ యూత్ సమన్వయ కర్త Ch గోపాలరావు గారు తెలిపారు సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా