Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సూచనలు మేరకు , స్వామి వారి శత జయంతి వేడుకలు సందర్భంగా, 100 గ్రామాలలో మండుటెండలో పనిచేసే ఉపాధిహామీ కూలీల దాహార్తి తీర్చేందుకు లక్ష్యంగా జరుగుతున్న సేవలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సమితి కొంగర భజన మండలి, కొంగర గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సుమారు 100 మందికి ఉచితంగా మజ్జిగ పంచడం జరిగినది ..ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో భజన మండలి కన్వీనర్ చిట్టూరి వెంకయ్య గారు, ఫీల్డ్ అసిస్టెంట్ మాగి సైదులు గారు, స్వామి భక్తులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా