Service
🌺ఓం శ్రీ సాయిరాం 🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా తెలంగాణ 🌻🌻🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు 24/5/2026 ఉదయం ఖమ్మం సమితి లో యువజన విభాగం వారి ఆధ్వర్యములో ఖమ్మం పాత బస్టాండ్ దగ్గర సిటీ సెంట్రల్ మెడికల్ హాల్ ముందు మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమము జరిగింది. ఉదయం 9.30 నిమిషములకు జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దమ్మాలపాటి సుధాకరరావు గారిచే ప్రారంభించబడింది. ఈకార్యక్రమములో సంస్థ సీనియర్ సభ్యులు, ఖమ్మం,భద్రాద్రి ఉభయజిల్లాల సమన్వయ కర్త శ్రీ కందిబండ.రాంప్రసాద్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సంస్థలో సీనియర్ సభ్యులు ,జిల్లా డిప్యూటీ యూత్ సమన్వయ కర్త ,జిల్లా మహిళా యూత్ సమన్వయ కర్త లు,ఖమ్మం సమితి బాధ్యులు,యూత్ సభ్యులు పురుషులు,మహిళలు ,సమితిలో ఆక్టివ్ మెంబెర్స్ అందరూ భాగస్వామ్యులు అయి , సేవలందించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుల వారు ఇటువంటి మహత్తర మైన సేవను ఖమ్మం యూత్ విభాగము వారు నిర్వహించినందుకు వారిని అభినందించారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా