Special Programs
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌹🌹 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 19/5/2026 తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకునే మహిళా దినోత్సవ వేడుకలలో భాగముగా, నగర సంకీర్తన, భజనలతో పాటు ఖమ్మం సమితి, ఖమ్మం పట్టణం లో, జన్మిబండ ప్రాంతంలో జాగృతి నివాస్ అపార్ట్మెంట్ లో శ్రీ Ch.శంకరనారాయణ గారు ,శ్రీమతి సువర్ణ గారి గృహములో మహిళా దినోత్సవ వేడుకలు అంగ రంగ వైభవముగా మహిళలచేత ఘనముగా నిర్వహించబడినవి. మహిళలకు ఆధ్యాత్మిక ఆటల పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించారు.. బాలవికాస్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించబడ్డాయి.. చిన్నారులు తమ అద్భుత ప్రదర్శనల తో అలరించారు. విజేతలకు బహుమతులు , బాల వికాస్ విద్యార్థులకు, సమ్మర్ క్యాంప్ లో పాల్గొన్నవారికి సర్టిఫికెట్స్ అందచేయుట జరిగింది.ఈకార్యక్రమంలో మహిళలు,పురుషులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు. ఈకార్యక్రమములో జిల్లా అద్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దమ్మాలపాటి.సుధాకర రావు గారు, పెద్దలు శ్రీ మాదిరాజు.రామచంద్ర రావు గారు ,జిల్లా కార్యవర్గ సభ్యులు,ఖమ్మం సమితి బాధ్యులు, సాయి కుటుంబ సభ్యులు,యూత్ సభ్యులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యముగా మహిళలు అందరూ రెట్టించిన ఉత్సాహముతో పాల్గొని మహిళా దినోత్సవ కార్యక్రమమును దిగ్విజయంగా నిర్వహించుకొనుట జరిగినది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఆర్గనైజర్స్, బాలవికాస్ గురువులు , మహిళలు రూపొందించుకున్న కార్యక్రమం " శ్రీమయి - జ్యోతిర్మయి" నీరాజనాన్ని స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించుకొనుట జరిగింది.. మహిళలచే స్వామి వారికి మహా మంగళహారతి సమర్పణ తో కార్యక్రమం ముగిసింది. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా