Special Programs
ఓం శ్రీ సాయిరాం ఖమ్మం జిల్లా, ఖమ్మం సమితి, నాగులవంచ గ్రామంలో "శ్రీ సత్య సాయి ప్రేమామృత విద్యానికేతన్ " విలువలతో కూడిన ఉచిత విద్యాలయం మరియు ప్రకృతి వైద్యాలయం నిర్మాణం కొరకు(5-00 ఎకరాల సువిశాల విస్తీర్ణం లో ) 9/5/2026 తేదీన భూమిపూజ కార్యక్రమం స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో అత్యంత వైభవంగా జరిగిన విషయం విదితమే.. నిర్మాణ పనులు శీఘ్రగతిన కొనసాగింపు గా 11/5/2026 తేదీన బోర్ వెల్ వేయగా స్వామి వారు ప్రేమతో పుష్కలంగా నీటితో తమ ప్రేమామృత ధార ను కురిపించారు.. స్వామి వారి ప్రేమ అనుగ్రహ ఆశీస్సులను ప్రకటించారు.. ఈ కార్యక్రమంలో శ్రీ దమ్మాలపాటి సుధాకరరావు గారు శ్రీ సత్య సాయి సేవా సంస్థల జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీ k భాస్కర రావు గారు జిల్లా సర్వీసు కోఆర్డినేటర్, శ్రీ పెండ్లి శ్రీనివాస రెడ్డి గారు శ్రీ సత్యసాయి ధ్యాన మండలి వారు పాల్గొన్నారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా, తెలంగాణ