Special Programs
గతములో మాదిరి ఈ రోజు , భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో , ఖమ్మం పాత బస్ స్టేషన్ ఆవరణలో చలివేంద్రం, బస్ స్టేషన్ మేనేజర్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో శ్రీ మాదిరాజు రామచంద్రరావు గారు, డా.వాసుదేవ్ గారు, ఖమ్మం సమితి కన్వీనర్ శ్రీ ఆలిశ్యం నరసింహారావు గారు, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా బాధ్యులు, సమితి బాధ్యులు మరియు మహిళా విభాగం నుండి ఆ సేవలో పాల్గొనే మహిళలు హాజరు అయినారు. తదనంతరం అక్కడ ఉండే ప్రయాణీకులకు పెద్దల చేతుల మీదుగా జల ప్రసాదం అందించటం జరిగినది. వేసవి తీవ్రత దృష్ట్యా ఈ సేవా కార్యక్రమం ప్రారంభం చేయడం పలువురు ప్రయాణీకులు మరియు RTC అధికారులు ప్రశంసించారు.. సాయిరాం