Special Programs
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా, తెలంగాణ 🌹🌹 🌺 శ్రీ సత్యసాయి ప్రేమ రథ యాత్ర ముగింపు వేడుకలు 🌺 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... స్వామి వారి శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని, ఖమ్మం జిల్లాలో రైతు సంక్షేమాన్ని ఆశీస్తూ , పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుతూ, ప్రజల శ్రేయస్సును కోరుతూ, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ అన్ని గ్రామాల్లో ప్రజలు అందరికి స్వామి వారి దర్శనాన్ని, ఆశీస్సులను, ప్రేమను అందించాలి అనే సంకల్పంతో " శ్రీ సత్యసాయి ప్రేమ రథ యాత్ర" ను 5/3/2024 తేదీన సత్తుపల్లి శ్రీ సత్యసాయి ప్రశాంతి సేవా నిలయం లో శ్రీ RJ రత్నాకర్ గారు, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మరియు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిచే ప్రారంభించుకొని స్వామి వారి కృపతో జిల్లాలోని 720 గ్రామాలలో నిర్వహించి 22/3/2026 తేదీన కూసుమంచి శివాలయం ప్రాంగణం లో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించబడినవి.. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలలో భాగంగా వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీ మహేష్ గారిచే కూసుమంచి ప్రధాన రహదారిలో చలివేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. శ్రీ సత్యసాయి ప్రేమ రథ యాత్ర ముగింపు వేడుకలు లో భాగంగా స్వామి వారి రథ యాత్ర కన్వీనర్ శ్రీ Ch రమేష్ గారి ఇంటి నుండి ప్రారంభమై కూసుమంచి పుర వీధుల గుండా శివాలయం వరకు రెండు గంటలు పైగా అద్భుతంగా జరిగింది.. భక్తులు స్వామి వారి రథం తమ ఇళ్ల వద్దకు రాగానే బిందెడు నీరు వారగా పోసి మంగళహారతులతో స్వాగతం పలికారు. శివాలయం వేదికగా ముగింపు సమావేశం జరిగింది.. శ్రీ దమ్మాలపాటి సుధాకరరావు గారు జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసంగిస్తూ స్వామి వారి అనుగ్రహంతో సంకల్పించుకున్న ప్రేమ రథ యాత్ర గత రెండు సంవత్సరాలుగా నిరంతరాయంగా 720 గ్రామాలలో పూర్తి చేసుకున్న తీరుతెన్నులు వివరించారు.. స్వామి వారి ప్రేమ ఆశీస్సులతో మాత్రమే ఇట్టి విశిష్ఠ కార్యక్రమం విజయవంతమైనది అన్నారు.. గతములో రథయాత్రలు నిర్వహించి దర్శనానికి వచ్చిన రథసారథులను స్వామి వారు ప్రేమతో అనుగ్రహించిన తీరు వివరించారు.. ఎండ, వాన చలికి వెరవకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రమిస్తూ కార్యక్రమాన్ని జిల్లా లోని గ్రామ గ్రామాన వైభవంగా నిర్వహించిన సమితి కన్వీనర్లకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు, అవిశ్రాంతముగ సేవలు అందించిన రథ సారథులకు, యూత్ సభ్యులకు, మహిళా సభ్యులకు, సీనియర్ సభ్యులకు, యాక్టివ్ సభ్యులకు ముఖ్యంగా గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు , కోలాటం చక్క భజన కళాకారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.. విశిష్ఠ అతిథి శ్రీ మహేష్ గారు, రాష్ట్ర ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ గారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా లో నిర్వహిస్తున్న అనేక విశిష్ఠ సేవాకార్యక్రమాలు ప్రస్తుతించారు.. బాలవికాస్ సెంటర్స్ నిర్వహణ ప్రాధాన్యత వివరిస్తూ తమ అనుభవాలను పంచుకున్నారు.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి శ్రీ సత్యసాయి గురుకుల విద్యా నికేతన్ కరస్పాండెంట్ శ్రీ వెంకటేశ్వర రావు గారు, శ్రీ Ch రమేష్ కూసుమంచి సమితి కన్వీనర్ గారు పలువురు ప్రముఖులు ప్రసంగించారు.. వేద విద్యా ప్రవీణ పురస్కార గ్రహీత , శ్రీ సత్యసాయి వేద పాఠశాల, వైరా గురువు గారు బ్రహ్మశ్రీ దుర్భాకుల కుమారశర్మావధాని గారికి సన్మానం జరిగింది. వారు స్వామి వారితో తమకు ఉన్న అనుభవాలు పంచుకొని తదుపరి అందరికి వేద ఆశీర్వచనం అందించారు. కూసుమంచి శివాలయం అర్చకులు ప్రేమతో కార్యక్రమం లో పాల్గొన్నారు.. శ్రీ మహేష్ గారు రాష్ట్ర ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ మరియు, ఆత్మీయ అతిథులు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు..తదితర ప్రముఖులచే , సాయి సభ్యులచే, వేద పండితులచే స్వామి వారికి మహా మంగళ హారతి సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.. ఇట్టి సేవా కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్లు, సమితి కార్యవర్గ సభ్యులు, భజన మండలి కన్వీనర్లు, యూత్ సభ్యులు, యాక్టీవ్ సభ్యులు, సీనియర్ సభ్యులు , మహిళా సభ్యులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా తెలంగాణ