Special Programs
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా తెలంగాణ 🌻🌻 🌹 జక్కేపల్లి సమితి మందిర ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు🌹 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... జక్కేపల్లి సమితి మందిర ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు 22/3/2026 ఆదివారం నాడు గతములో శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారిచే 5/3/2024 తేదీన ప్రారంభించుకున్న శ్రీ సత్యసాయి ప్రేమామృత సేవా నిలయం జక్కేపల్లి వేదికగా అత్యంత వైభవంగా నిర్వహించబడినవి.. ఉదయం స్వామి వారి అష్టోత్తరం, హనుమాన్ చాలీసా, భజనలతో కార్యక్రమాల ప్రారంభం జరిగింది. శ్రీ దమ్మాలపాటి సుధాకర రావు గారు, జిల్లా అద్యక్షులు & రాష్ట్ర ఉపాధ్యక్షులు గారిచే జక్కేపల్లి సమితి కార్యక్రమాల సమీక్ష జరిగింది..జరుగబోయే కార్యక్రమాలకు దిశా నిర్దేశం చేశారు..జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు తెలియజేశారు.. విశిష్ఠ అతిథులుగా హాజరయిన రాష్ట్ర ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీ మహేష్ గారు తమ సత్సంగం లో అనేక ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు గురించి వివరించారు. స్వామి వారి సందేశాలు అందించారు.. శ్రీ సత్యసాయి రైతు సేవా కేంద్రం జక్కేపల్లి లో నిర్వహించుకోవడం రైతు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణ మన్నారు .. శ్రీ వెంకటేశ్వర రావు గారు , కరస్పాండెంట్ శ్రీ సత్యసాయి గురుకుల విద్యా నికేతన్ బెజ్జంకి, సిద్దిపేట జిల్లా వారు, స్థానిక సర్పంచ్ శ్రీ చంద్రా రెడ్డి గారు మరియు ఇతర ప్రముఖులు ప్రసంగించారు. ఈ సందర్భంగా యువ రైతులను ప్రోత్సహిస్తూ వారిని పురస్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకట రెడ్డి గారు జక్కేపల్లి సమితి కన్వీనర్, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు, యాక్టీవ్ సభ్యులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.. గ్రామస్థులు ప్రేమతో పాల్గొన్నారు. స్వామి వారికి మంగళ హారతి సమర్పణ తో కార్యక్రమం ముగిసింది. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా