Bhajans
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి సమితి , ముదిగొండ మండలంలోని సువర్ణాపురం గ్రామంలో నూతనంగా భగవాన్ శ్రీ సత్యసాయి భజనమండలి 17/3/2026 మంగళవారం సాయంత్రం 6-00 గంటలకు వైభవంగా ప్రారంభించబడింది. నేలకొండపల్లి సమితిలో 11వ భజన మండలి గా సువర్ణాపురం గ్రామంలో ప్రారంభించిన అనంతరం శ్రీ దమ్మాలపాటి సుధాకరరావు గారు జిల్లా అద్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసంగించారు.. ఎన్నో సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు జరుగుతున్న సువర్ణాపురం గ్రామంలో స్వామి వారి శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని నూతనంగా భజన మండలి ప్రారంభించుకోవడం స్వామి వారి ప్రేమకు నిదర్శనమన్నారు..ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన స్వామి వారి శత జయంతి ఉత్సవాలు గురించి , సంస్థాపరంగా నిర్వహించే సేవాకార్యక్రమాలు గురించి తెలియజేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, ఖమ్మం, నేలకొండపల్లి సమితి కన్వీనర్లు, మహిళా సభ్యులు , యూత్ సభ్యులు యాక్టీవ్ సభ్యులు , నేలకొండపల్లి సమితి సభ్యులు, భజనమండలి కన్వీనర్లు పాల్గొన్నారు.. నాయకులు శ్రీ దేవేందర్ గారు, నాసరయ్య గారు తమ గ్రామంలో భజన మండలి ఏర్పాటు హర్షదాయకమంటూ తమ అనుభవాలు పంచుకున్నారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా