Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రం భైరవునిపల్లి గ్రామం నేలకొండపల్లి సమితి 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవాసమితి నేలకొండపల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా శిబిరం 19/2/2025 గురువారంనాడు శ్రీ సత్యసాయి భజన మండలి. భైరవునిపల్లి గ్రామంలో శ్రీమతి బేతంపూడి అన్నపూర్ణ గారి ఇంటివద్ద ప్రారంభించబడింది. ఇట్టి శిక్షణా కాలపరిమితి 45 రోజులు.. బ్యాచెస్ వారిగా శిక్షణ ఇవ్వబడుతుంది. మహిళలకు ఎంతో అవసరమైన, ఉపాధి కల్పించే ఈ ఉచిత శిక్షణా సేవా కార్యక్రమం స్వామి వారి ప్రేమతో భైరవునిపల్లి గ్రామంలో వైభవంగా ప్రారంభించబడింది.. ఈ ప్రారంభ కార్యక్రమంలో శ్రీ డి సుధాకరరావు గారు జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నేలకొండపల్లి సమితి కన్వీనర్ గారు, సమితి సభ్యులు, భైరవునిపల్లి భజన మండలి కన్వీనర్, సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.. ఇట్టి సేవలను ఉపయోగించుకోవలసినదిగా గ్రామీణ మహిళలను జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దమ్మాలపాటి సుధాకరరావు గారు కోరారు. శిక్షణ పొందగోరువారు నేలకొండపల్లి సమితి కన్వీనర్ శ్రీ గెల్లా వెంకట రమణ గుప్తా గారిని సంప్రదించగలరు. మొబైల్ 93937 72427 సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా