Special Programs
🌹ఓమ్ శ్రీ సాయిరామ్ 🌹 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో .....స్వామి వారి శత జయంతి (100 వ పుట్టుపండుగ )ఉత్సవాలలో బాగంగా శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమరథ శోభాయాత్ర ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 18 మండలాలు, 681 గ్రామాలు పూర్తిచేసుకుని 04-02-2026 తేది సాయంత్రం 5:30 గంటల నుండి 474వ రోజు సేవా కార్యక్రమం కుసుమంచి సమితి , తిరుమలాయపాలెం మండలం పాపాయిగూడెం గ్రామం లో అత్యంత ఘనంగా , వైభవంగా నిర్వహించబడింది .. జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కార్యవర్గ సభ్యులు,భక్తులు మరియు గ్రామప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందారు..ఈ కార్యక్రమాన్ని గత 10 రోజులుగా తిరుమలాయపాలెం మండలం లో ప్రణాళికాబద్ధంగా , గ్రామస్థులకు ముందుగా తెలియజేసి, భక్తులను సమాయత్తం చేసి భక్తులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకునే ఏర్పాటు చేసిన శ్రీ రమేష్ గారు కూసుమంచి సమితి కన్వీనర్, శ్రీ వీరభద్రం గారు బాలవికాస్ గురువు, శ్రీ ఉలవ భద్రం గారు, శ్రీ యలకొండ లింగయ్య గారు, శ్రీరామ్ గారు స్వామి వారి ఆశీస్సులు పొందారు.. కార్యక్రమం లో పాల్గొన్న అందరికి సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా