Special Programs
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 18 10 25 శనివారం , వేంసూరు సమితి మొద్దుల గూడెం గ్రామంలోని శ్రీ వివేకానంద విద్యాలయం ప్రాంగణం నందు శ్రీ సత్యసాయి సేవా సమితి వేంసూర్ వారి ఆధ్వర్యంలో విద్యాసదస్సు మరియు గ్రామ సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్ట్ చైర్మన్ వై శ్రీనివాస్ గారు పాల్గొని ప్రసంగించారు అదేవిధంగా మోటివేషన్ స్పీకర్ గా అంతర్జాతీయ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ సాయి గొల్లపూడి గారి స్పీచ్ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నది.. ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డిక్షనరీస్ మెడల్స్ స్వామి వారి చిత్రపటాలు బహూకరించడం జరిగింది.. అదేవిధంగా అన్ని పాఠశాలల విజేత విద్యార్థులకు కూడా బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది తరువాత నాయకులగూడెం లోని నిరుపేద నాయక కుటుంబాలకు 20 మందికి నిత్యావసర వస్తువులు దుప్పట్లు ఆడవారికి చీరలు అవసరమైన వారికి వాకర్స్ పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథి, శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ డి సుధాకర్ రావు గారు, MPDO శ్రీ బి రాజారావు గారు విద్యాధికారి సిహెచ్ వెంకటేశ్వరరావు గారు పాఠశాల ప్రిన్సిపాల్ నాగేందర్ రెడ్డి గారు శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ శ్రీ కళ్యాణ్ శర్మ గారు పాల్గొని ప్రసంగించినారు.. కార్యక్రమంలో సంస్థ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా