Special Programs
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻 - కలియుగ అవతారి , భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలు విశ్వ వ్యాప్తంగా సాయి భక్తులు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపు కుంటున్న ఈ శుభవేళ ఖమ్మం జిల్లా,జక్కేపల్లి స్వామి వారి మందిరం, శ్రీ సత్యసాయి ప్రేమామృత సేవా నిలయం లో స్వామి వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా అనేక ఆధ్యాత్మిక , సేవా కార్యక్రమాలు 18/10/2025 తేదీన అత్యంత వైభవంగా జరిగాయి. యూత్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా జక్కేపల్లి సమితి జక్కేపల్లి గ్రామం స్వామి వారి మందిర ప్రాంగణంలో సాయంత్రం 100 మంది కూసుమంచి మండల పారిశుధ్య కార్మికులకు సన్మానం, వస్త్ర వితరణ ప్రేమతో జరిగింది.. ఈ సందర్భంగా శ్రీ సాయి గొల్లపూడి గారు విశిష్ఠ అతిథి శ్రీ సత్య సాయి గ్రామసేవా ట్రస్ట్ మెంబర్ మోటివేషనల్ స్పీకర్ గారు, శ్రీ Y శ్రీనివాస్ గారు విశిష్ఠ అతిథి , శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్ట్ చైర్మన్ గారు, మరొక గౌరవ ఆత్మీయ అతిథి శ్రీ శశాంక్ గారు భక్తుల నుద్దేశించి ప్రసంగించారు.. శ్రీ D సుధాకర రావు గారు ఖమ్మం జిల్లా అద్యక్షులు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సేవా కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. ఆతర్వాత జక్కేపల్లి గ్రామం లో శ్రీ సత్యసాయి ప్రేమ రథ యాత్ర ప్రారంభించి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్లు, సమితిసభ్యులు, 50 మంది యూత్ సభ్యులు, మహిళలు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా