Inauguration
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని , సంకల్పించుకున్న ప్రకారం స్వామి వారి ఆశీస్సులతో ఖమ్మం జిల్లా లో కూసుమంచి భజన మండలి కూసుమంచి సమితిగా ఆవిర్భావ శుభ సందర్భంగా 13/9/2025 తేదీన కూసుమంచి లో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వైరా వేద పాఠశాల పండితులచే నిర్వహించబడింది..వేద విద్యార్థులు కూడా పాల్గొన్నారు.. నూతనంగా ఏర్పాటైన కూసుమంచి సమితి కి స్వామి వారి ఆశీస్సులతో శ్రీ చౌడవరపు రమేష్ గారు కన్వీనర్ గా జిల్లా అధ్యక్షుల వారిచే నామినేట్ చేయబడి ప్రకటించ బడ్డారు..ఈ సందర్భంగా జిల్లా అద్యక్షులు అనేక సేవా కార్యక్రమాలు గురించి తెలియజేశారు.. 2026 జనవరి నెలలో కళా బృందాల తో చేపట్టనున్న పర్తి యాత్ర గురించి వివరించారు..23/9/2025 తేదీన భక్తరామదాసు కళాక్షేత్రం ఖమ్మం లో నిర్వహించనున్న కళాకారుల సమావేశానికి సంబంధించి పాంప్లెట్ ఆవిష్కరించారు.. జక్కేపల్లి సమితి కార్యక్రమాల సమీక్ష కూడా చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్లు, సమితిసభ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు,యాక్టివ్ సభ్యులు, పాల్గొన్నారు.. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా