Special Programs
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా *** 🌻ఖమ్మం జిల్లాలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న శ్రీ సత్యసాయి ప్రేమరథ యాత్ర 🌻 🪷🪷 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని సంకల్పించుకున్న శ్రీ సత్యసాయి సాయి ప్రేమ రథ యాత్ర మార్చ్ 2024 నుండి 603 గ్రామాలు (727 గ్రామాలకు గాను) 17 మండలాలలో పూర్తి చేసుకొని 31/8/2025 తేదీన ఆదివారం నాడు 407 వ రోజు నేలకొండపల్లి మండలం, నేలకొండపల్లి సమితి, రాయిగూడెం గ్రామంలో అత్యంత వైభవంగా సాయంత్రం 6-00 గంటల నుండి జరిగింది..గ్రామంలో జరిగిన రథ యాత్ర లో గ్రామస్థులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో, ప్రేమతో పాల్గొన్నారు..ప్రతి ఇంటిముందు స్వామి వారికి నీరాజనములు సమర్పించారు..స్వామి వారి ప్రసాదం స్వీకరించారు. ఎంతో ఉత్సాహంగా మహిళలు కోలాట నృత్యాలు ప్రదర్శిస్తూ స్వామి వారికి స్వాగతం పలికారు.. అత్యంత ఆనందోత్సాహాలతో స్వామి వారి రథ యాత్ర కొనసాగింది. ఇంకనూ "ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి" కార్యక్రమం లో భాగంగా 9 గృహ భజనలు కూడా వైభవంగా జరిగాయి.. రాయిగూడెం భజన మండలి, రాయిగూడెం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నేలకొండపల్లి సమితి కన్వీనర్, సమితి సభ్యులు, భజన మండలి కన్వీనర్, సభ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా