ప్రస్తుత సమాజంలో ప్రతీ రంగంలో కూడా మానవతా విలువలు అడుగంటిపోవడం వల్ల నానాటికి మన సమాజం ఎన్నో అకృత్యాలు, అరాచకాలు, అమానవీయ సంఘటనలు, అవినీతి, హింస, దౌర్జన్యం వంటి వాటితో బలి అయిపోతుంది. ప్రక్క వారి ఇల్లు కాలితే నాకేంటి అని అనుకుంటే అది తప్పక మన ఇంటిని కూడా కాల్చినట్లే, నాకేం కాలేదు అని ఎవరికి వారు మౌనంగా పట్టించుకోకుంటే ఎప్పుడో ఒకప్పుడు వాటి ప్రభావం మన మీద తప్పక పడుతుంది. కావున ప్రతి ఒక్కరం నడుం కట్టి, మార్పు కోసం *“మానవతా విలువలైన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస”* లను మన పంచ ప్రాణాలుగా గుర్తించి వాటిని ప్రతి క్షణం, ప్రతీ రంగంలోని వారు వారి జీవితంలో భాగంగా చేసుకొని ఆచరిస్తే తప్పక మన సమాజంలో శాంతి సౌఖ్యాలు వెళ్లి విరుస్తాయి. శ్రీ సత్య సాయి బాబా వారు ఇట్టి మానవతా విలువల్ని ఆచరించి, యావత్ మానవాళికి ఆదర్శాన్ని చూపారు. ఒక్కసారి వాటి ప్రాముఖ్యాన్ని ప్రజలందరికి గుర్తు చేయడానికై ... భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్య సాయి సేవా సమితి , రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో తేది 16-12-2018 ఆదివారం రోజున విలువలకై నడక (Walk For Values) కార్యక్రమమును నిర్వహించుకోవడం జరిగింది. శ్రీ సత్యసాయి సేవా మందిరం నుండి ప్రారంభమై పట్టణ పుర వీధులగుండా నడక సాగిస్తూ వెళ్లి ప్రముఖుల సందేశాలతో ముగింపు చేయబడింది. ఇట్టి సకార్యంలో 120మంది సభ్యులు పాల్గొన్నారు.