Special Programs
🙏🏾ఓం శ్రీ సాయిరాం🙏🏾 🔹భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించుకునే"100 గ్రామాలలో100 పల్లకీ సేవల "మహాయజ్ఞంలో భాగంగ "ఖమ్మం సమితిలోని యువజన విభాగం "వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే 96 వ పల్లకీ సేవ మహాయజ్ఞం ఈ నెల (20-03-2025)వ తేది గురువారం సాయంత్రం 6:30 ని.లకు ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, జగన్నాధపురం గ్రామములో అంగ రంగ వైభవంగా నిర్వహించబడింది.స్వామి వారు తమ ఇంటిముందుకు వచ్చినప్పుడు ఇంటివారందరు నీరు వారగా పోసి స్వామి వారికి మంగళ నీరాంజనములు సమర్పించి స్వామి వారి ఆశీస్సులు పొందినారు.ఈ సేవా కార్యక్రమములో యూత్ సభ్యులు,భక్తులు, గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందినారు. ఈకార్యక్రమములో ఆ గ్రామములోని భక్తులు స్వామి వారి ఊరేగింపులో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకుని తరించారు. ఈ సేవా కార్యక్రమములో జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు,జిల్లా కార్యవర్గ సభ్యులు, ఖమ్మం సమితి కన్వీనర్ ,సమితి కార్యవర్గ సభ్యులు,భక్తులు పాల్గొని స్వామి వారీ ఆశీస్సులు పొందినారు. సాయిరాం