Pujas & Vrathams
*ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో* ఈరోజు నేలకొండపల్లి సమితి సాయి సుందర రామదాసు మందిర 26వ వార్షికోత్సవం సందర్భంగా మందిరంలో వివిధ కార్యక్రమాలు. వైభవంగా నిర్వహించడం జరిగింది.. ▶️ ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది ▶️ ఉదయం ఏడు గంటలకు స్వయంభు షిరిడి సాయినాధునికి పంచామృతములతో అభిషేక కార్యక్రమం జరిగింది ▶️ ఉదయం 9 గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతం దంపతులతో నిర్వహించడం జరిగింది ▶️ ఉదయం 10 గంటల నుంచి జిల్లా అధ్యక్షులు మరియు ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వీస్ కోఆర్డినేటర్ శ్రీ కొమరగిరి శ్యాం ప్రసాద్ గారి ఆధ్యాత్మిక ప్రసంగం, స్వామి వారితో వారికి ఉన్న అనుభవాలు వివరించడం జరిగింది.. ఈ యొక్క కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలో త్వరలో ప్రారంభించుకోబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు కు సంబంధించిన గూగుల్ ఫామ్ రిలీజ్ చేయడం జరిగింది.. ▶️ మానవత విలువల బోధన జరిగే స్కూళ్లలో పిల్లలకు నిర్వహించిన వ్యాస రచన కాంపిటీషన్లో విజేతలైన విద్యార్థులకు మొదటి ,రెండవ మరియు మూడవ బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.. ఈ యొక్క కార్యక్రమంలో అతిధి శ్యాంప్రసాద్ గారు ,జిల్లా అధ్యక్షులు వారు ,జిల్లా కోఆర్డినేటర్లు , శ్రీ వంగవీటి భాస్కర్ రావు గారు, మరియు వివిధ సమితుల కన్వీనర్లు భజన మండలి కన్వీనర్లు. స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు జై సాయిరాం🙏🙏