Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 వ జయంతి మహోత్సవ వేడుకలలో నేడు 19-11-24 వ తేదీ మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవమును పురస్కరించుకుని ఉదయం 5 గంటలకు ఓంకారం, సుప్రభాతము,నగర సంకీర్తన ,పల్లకీ సేవ ఖమ్మం గొల్లగూడెం రోడ్డు లో మధురానగర్ రోడ్డు నెంబర్ : 1 కు ఆపోజిట్ లో వున్న సివిఆర్ స్క్వేర్ భ్యాంకెట్ హాల్ లో మహిళల చేత నిర్వహించబడినది.ఈ రోజు సుప్రభాత సేవాకార్యక్రమములో సాయి కుటుంబ సభ్యులందరు ముఖ్యముగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈరోజు ఉదయం సుప్రభాత సేవా కార్యక్రమమును నిర్విఘ్నముగా పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటు, ఈరోజు కార్యక్రమములో పాల్గొన్న సాయి కుటుంబ సభ్యులందరికీ సంస్థ తరఫున ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి,ఖమ్మం.