Service
ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సత్య సాయిసేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... స్వామి వారి 99వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా, గ్రామ సేవయే రామ సేవగా, ఖమ్మం జిల్లా యువజన విభాగం వారిచే జక్కేపల్లి సమితి , కూసుమంచి భజన మండలి, కూసుమంచి గ్రామంలో 3/11/2024 ఆదివారం నాడు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించబడినవి.. ▶️పశు వైద్య శిబిరం స్వామివారి దివ్య అనుగ్రహముతో ఉదయం 6-45 గంటలకు జిల్లా అద్యక్షుల వారిచే ప్రారంభించబడి, వెటర్నరీ డాక్టర్ శ్రీమతి N ఉమాకుమారి గారి పర్యవేక్షణ లో పశు వైద్య సేవలు అందించడం జరిగింది. ▶️రక్త దాన శిబిరం ఉదయం 9-00 గంటలకు రక్తదాన శిబిరం నిర్వహించబడింది..15 మంది యూత్ సభ్యులు 15 యూనిట్స్ రక్తం డొనేట్ చేయటం జరిగింది ▶️ స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో భాగంగా ఉదయం 10-00 గంటల నుండి మధ్యాహ్నం 1-00 వరకు , ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ స్కూల్, శివాలయం, రామాలయం దేవాలయాలు, వెటర్నరీ హాస్పటల్ ప్రాంగణము పరిశుభ్రం చేయడం జరిగింది ▶️ బాలవికాస్ మధ్యాహ్నం 1-45 నుండి బాలవికాస్ కార్యక్రమం జరిగింది ▶️ బ్లాంకెట్స్ పంపిణీ సేవ మధ్యాహ్నం 3-00 గంటల నుండి 3-30 వరకు 11 మంది కి బ్లాంకెట్స్ పంపిణీ జరిగింది.. ▶️పల్లకి సేవ సాయంత్రం 6-00 గంటల నుండి 9-00 వరకు స్వామి వారి పల్లకి సేవ వైభవంగా జరిగింది..గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. మంగళ నీరాజనాలు సమర్పించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.. స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో గ్రామ సేవ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా