District / State Meetings
🌻ఓం శ్రీ సాయిరాం🌻 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.. నేలకొండపల్లి మరియు జక్కేపల్లి సమితుల యూత్ విభాగ సమీక్షా సమావేశం 7/7/2024 ఉదయం 9-00 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంట వరకు నేలకొండపల్లి మందిర ప్రాంగణంలో నిర్వహించబడింది.. ఈ కార్యక్రమంలో శ్రీ దమ్మాలపాటి సుధాకర రావు గారు జిల్లా అద్యక్షులు మరియు శ్రీ వంగవీటి భాస్కర రావు గారు, నేలకొండపల్లి ట్రస్ట్ చైర్మన్, చెన్నై వారు , జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్లు, కార్య వర్గ సభ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. జిల్లా అధ్యక్షులు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు వివరించారు..స్వామి కృపతో విజయవంతంగా నడుస్తున్న శ్రీ సత్యసాయి రథ యాత్ర గురించి, యూత్ సభ్యులు తదుపరి చేపట్టవలసిన అంశములు గురించి చర్చించారు.. స్వామి వారి శతజయంతి ఉత్సవాలు సందర్భంగా చేపట్టవలసిన కార్యక్రమాలు గురించి మరియు భజన మండలులు బలోపేతం చేయుట, విస్తృత పరచుట సంబంధించి , బాల వికాస్ మరియు ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ కార్యక్రమం గురించి, గురుపూర్ణిమ సందర్భంగా గురువులతో పర్తి యాత్ర గురించి చర్చించారు.. శ్రీ వంగవీటి భాస్కర రావు గారు ట్రస్ట్ చైర్మన్ , చెన్నై వారు తమ ప్రసంగం ద్వారా యూత్ సభ్యులకు పలు సూచనలు చేస్తూ దిశా నిర్దేశం చేశారు.. యూత్ సభ్యులు తమ స్పందన మరియు ప్రణాళిక తెలియజేశారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా