District / State Meetings






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా ***** భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, స్వామి వారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా నేలకొండపల్లి మందిరము లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము 1/10/2023 ఆదివారం నాడు నిర్వహించుకున్న తరువాత సాయంత్రం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించబడింది.. ఈ సమావేశంలో శ్రీ S యాదగిరి రావుగారు ప్రశాంతి నిలయం సేవలు రాష్ట్ర ఇంఛార్జి శ్రీ R అనిల్ కుమార్ గారు రాష్ట్ర అధ్యాత్మిక కోఆర్డినేటర్ పాల్గొని బాలవికాస్ జిల్లా ప్రేమరథం ప్రశాంతి నిలయం సేవలు అంశాలు పై సమీక్షించి పలు సూచనలు చేశారు. జిల్లా అద్యక్షులు మాట్లాడుతూ స్వామి వారి ప్రేమరథం త్వరలో ప్రారంభం కానున్నది అని తెలుపుతూ నిర్వహణ గురించి కన్వీనర్లతో చర్చించారు.. జిల్లా ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ (మహిళ)గా శ్రీమతి A తనూజ జిల్లా ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ (Gents) గా శ్రీ R అచ్యుత్ రావు జిల్లా IT కోఆర్డినేటర్ గా శ్రీ M అచ్యుత్ జిల్లా యూత్ కోఆర్డినేటర్ గా శ్రీ M సైదులు లను ప్రకటించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, అందరు సమితి కన్వీనర్లు, సమితి కార్యవర్గ సభ్యులు, యాక్టివ్ సభ్యులు, భజన మండలి కన్వీనర్లు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.. స్వామి వారికి హారతి సమర్పణతో కార్యక్రమం ముగిసింది.. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా..