District / State Meetings






ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... 17/3/2024 ఆదివారం నాడు శ్రీ సత్యసాయి ప్రేమామృత సేవా నిలయం జక్కేపల్లి లో సమీక్షా సమావేశం నిర్వహించబడింది.. జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, జక్కేపల్లి సమితి కన్వీనర్, జక్కేపల్లి సమితి కార్యవర్గ సభ్యులు, పలువురు పెద్దలు, గ్రామస్తులు ప్రముఖులు, సీనియర్ సభ్యులు యూత్ సభ్యులు, మహిళా సభ్యులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. పలువురు సభ్యులు తమ తమ అనుభవాలు తెలిపారు.. అతికొద్ది సమయంలోనే దివ్యమైన భవ్యమైన సుందరమైన శ్రీ సత్యసాయి ప్రేమామృత సేవానిలయము మరియు శ్రీ సత్య సాయి రైతు సేవా నిలయము నిర్మాణము పూర్తి చేయించిన స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.. జిల్లా అద్యక్షులు స్వామికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరం మాట్లాడుతూ ఈ కార్యక్రమం తరువాత మన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ సేవా నిలయం నుండి విస్తృతమైన సేవలు సమాజానికి రైతు వర్గానికి అందాలన్నారు..మందిర నిర్మాణం, శ్రీ RJ రత్నాకర్ గారు , మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వారిచే ప్రారంభోత్సవం. ప్రతి కార్యక్రమం విజయవంతం చేసేందుకు నిరంతరం కృషి చేసిన మహిళా సభ్యులను, యూత్ సభ్యులను, పెద్దలను, గ్రామస్థులను, జక్కెపల్లి సమితి కన్వీనర్ గారిని సభ్యులను, సేవలు అందించిన ప్రతి ఒక్కరిని అభినందించారు.. స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని, శ్రీ సత్యసాయి ప్రేమరధం చక్కటి ప్రణాళికతో జిల్లాలోని 587 గ్రామాలలో స్వామి దర్శనం కలిగించాలనే సంకల్పంతో సత్తుపల్లి లో ప్రారంభించుకొని గత 5 రోజులుగా యూత్ సభ్యులచే సత్తుపల్లి మండలంలోని గ్రామాలలో వైభవంగా కొనసాగుతున్నదని తెలిపారు.. స్వామి వారికి హారతి సమర్పణతో కార్యక్రమం ముగిసింది.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా