District / State Meetings






శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆధ్వర్యంలో తేది.08.10.2023 ఆదివారం నాడు శ్రీ సత్యసాయి సేవా సమితి, నిజాంపల్లిలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ P వెంకట్రావ్ గారి అధ్యక్షతన భూపాలపల్లి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించుకోడం జరిగింది. ఇందులో శ్రీమతి లక్ష్మీకాంతం గారు, రాష్ట్ర అధ్యాత్మిక సమన్వయ కర్త, శ్రీ హరినాథ్ రెడ్డి గారు, రాష్ట్ర విద్యా విభాగ సమన్వయ కర్త, శ్రీ R యాదగిరి గారు, రాష్ట్ర ప్రశాంతి సేవల సమన్వయ కర్త, శ్రీ అనీల్ కుమార్ గారు, రాష్ట్ర అధ్యాత్మిక సమన్వయ కర్త మరియు శ్రీ భాస్కర్ గారు, రాష్ట్ర ఇంచార్జీ భూపాలపల్లి జిల్లా పాల్గొని స్వామి వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా చేసిన, చేయవలసిన సేవల గురించి సమీక్షా మరియు సూచనలు ఇవ్వడం జరిగింది. రాబోయే డిసెంబరు 2023 లోపున టేకుమట్ల భజన మండలిని సేవా సమితి గా upgrade చేసుకోవాలని సంకల్పం, ఇంకా వెంకటేశ్వరపల్లె & భగీరథపేట గ్రామాలను భజన మండలిలు గా ఏర్పాటుకు సంకల్పం చేయడం జరిగింది. జిల్లా లోని సమన్వయ కర్తలు, సమితి & భజన మండలి కన్వీనర్లు, సమన్వయ కర్తలు, యూత్ సమన్వయ కర్తలు, క్రియాశీలక సభ్యులు మరియు సేవాదళ్ సభ్యులతో కలిపి దాదాపు 216 మంది పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారని, తదుపరి మెగా పల్లకిసేవ చేస్తూ నిజాంపల్లి పుర వీధులలో భగవన్నామాన్ని గానం చేస్తూ ఆనందాన్ని గ్రామస్థులకు అందించారని సంతోషముతో తెలియ జేస్తూ.... మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా