Sri Sathya Sai Grama Seva MahaYagnam





ఓం శ్రీ సాయిరాం స్వామి వారి కృపతో తేది.20.08.2023 ఆదివారం నాడు సాయంత్రం 05.00 గంటలనుండి రాత్రి 09.30 గంటల వరకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలనే సంకల్పంతో రేగొండ సమితికి దగ్గరలో వున్న చెంచుగూడెం గ్రామస్తులకు స్వామి వారి కానుకలుగా చీరలు, లుంగీలు, టవళ్ళు, రగ్గులు అలాగే పిల్లలకు డ్రెస్సులు, షర్టులు, నైటీలు, ప్యాంట్లు అందజేయడం జరిగింది. అలాగే పిల్లలకు బిస్కట్లు, చాకిలెట్లు పంపిణీ చేయడం జరిగింది. స్వామి వారి కృపతో దాదాపు 18 మంది సేవాదళ్ సభ్యులు, కోఆర్డినేటర్లు పాల్గొని ఈ గ్రామదర్శిని చెంచుగుడెంలో దాదాపు 98 మంది కుటుంబీకులకు స్వామి వారి కానుకలు పంపిణీ చేసి దిగ్విజయంగా రాత్రి 10.30 గంటలవరకు భూపాలపల్లి చేరడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనే భాగ్యాన్ని ప్రసాదించిన మన స్వామికి శతకోటి వందనాలు సమర్పించు కుంటూ..... Ch శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా