District / State Meetings






సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో తేది 20.8.2023(ఆదివారం) శ్రీ సత్యసాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం యొక్క 23వ వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కేంద్రం ద్వారా జరిగే నివేదికను(2022-23) ప్రధాన కార్యదర్శి చదివి వినిపించడం జరిగింది.సభ్యులందరూ తమ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే రాబోయే సంవత్సరానికి సంబంధించి చేయవలసిన కార్యక్రమాలను చర్చించడం జరిగింది ప్రతి సమితి కూడా కొన్ని కార్యక్రమాలను బాధ్యత తీసుకొని చేస్తే ఇంకా ఎక్కువగా సేవలను అందించిన వారం అవుతామని నిర్ణయించడం జరిగింది. త్వరలోనే ఈ కార్యక్రమాలను పొందుపరిచి తెలియజేయడం జరుగుతుంది. ఆయా కార్యక్రమాలను సమితీలవారీగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని చర్చించాలని కూడా తీర్మానించనైనది. అలాగే వచ్చే సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ------------------------------ శ్రీ సత్య సాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం , కేరెల్లి నూతన కార్యవర్గం (2023-2024) ------------------------------- సలహాదారులు: 1) శ్రీ T.జగదీశ్వర్ సింగ్ ఠాగూర్ గారు, జిల్లా అధ్యక్షులు, SSSSO వికారాబాద్ జిల్లా 2)శ్రీ S.వెంకట్ రెడ్డి , రంగాపూర్ గారు, 3శ్రీ D.ప్రభాకర్ ,చేవెళ్ల గారు, 4) శ్రీ K.నరసింహారెడ్డి , సర్పంచ్ కేరెల్లి గారు, అద్యక్షులు: శ్రీ B. రఘునందన్ గారు, ఉపాధ్యక్షులు: శ్రీ G.దశరథ్ గారు ప్రధాన కార్యదర్శి: శ్రీ M. ప్రేమ్ కుమార్ గారు సహాయ కార్యదర్శులు: 1) శ్రీ G. ప్రవీణ్ కుమార్ గారు 2) శ్రీ Y.వేణుగోపాల్ గారు కోశాధికారి: శ్రీ K.వెంకట్ రాంరెడ్డి గారు యూత్ సహాయ కార్యదర్శులు: 1(శ్రీ T.మహేందర్ రావు గారు 2) శ్రీ B.శ్రీకాంత్ రెడ్డి గారు సభ్యులు: 1)శ్రీ వీరేశం గౌడ్ గారు శ్రీ 2)శ్రీ అనంత రావు గారు 3)K.రామకృష్ణ రెడ్డి గారు, 4) శ్రీ సత్యనారాయణ గౌడ్ గారు 5) శ్రీ K.నాగరాజు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లు శ్రీ M.ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి, శ్రీ సత్య సాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం,కేరెల్లి వికారాబాద్ జిల్లా.