ఓం శ్రీ సాయిరాం🙏🙏 RR జిల్లా కోకాపేట లో జూలై 14,15,16 నాడు దేవతా మూర్తుల కళ్యాణ మహోత్సవం వేడుకలు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జన్మదిన వేడుకలు జరుగుతున్న ఈ సమయములో వారి దివ్య అధ్యక్షతన జూలై 14,15,16 /2023 నాడు మూడు రోజులు శ్రీ దేవతా మూర్తుల కళ్యాణ మహోత్సవం వేడుకలు మనికొండ సమితి పరిధిలో గల కోకాపేట లో లెజెండ్ చిమేస్ విల్లా హల్ లో శ్రీ సనాతన భాగవత భక్త సమాజం వారిచే 385 వ వేడుకగా, అత్యంత ఆనందంగా,వైభవముగా శోభాయమానంగా ఎంతో మంది సంస్థ పెద్దలు,వివిధ జిల్లా అధ్యక్షులు,రాష్ట్ర సమన్వయ కర్తలు, పాల్గొనగా స్వామి వారి పరిపూర్ణ ప్రేమతో చేసుకోవడం జరిగింది... ఈ పవిత్ర వేడుకలో భగవాన్ బాబా వారు స్వయంగా సృష్టించి ఇచ్చిన పవిత్ర మంగళ సూత్రం తో కళ్యాణ వేడుకలు జరిగినాయి... జూలై 14 శుక్రవారం నాడు ఉ.9.30 ని:లకు దేవతా మూర్తుల ఉత్స విగ్రహములు సన్నాయి మేళం తో ఊరేగింపు గా హాల్ లోకి వచ్చిన తర్వాత జ్యోతి ప్రజ్వలన,కలశ స్థాపన,సంకల్పం పూజ తో ప్రారంభమయ్యాయి.. మొదటి రోజు 10.15 నుండి శ్రీ సీతారామచంద్ర ప్రభు మూర్తుల కళ్యాణము వేడుక,మహా రుధ్రాభిషేఖం జరిగింది. సా..సత్సంగం స్వామి వారికి మంత్రపుష్పం ,మహాహారతి తో ముగిసింది...350 మంది భక్తులు పైగా పాల్గొన్నారు.. రెండవ రోజు శ్రీ హన్మత్ సువర్చలా దేవి మూర్తుల కల్యాణం,సహస్ర లింగార్చన, రుద్రాభిషేకం,సా: సత్సంగం,శ్రీ హనుమాన్ ఏకపాత్రాబినయం, మంత్రపుష్పం,మహా హారతి తో ముగిసింది..450 మంది భక్తులు పైగా పాల్గొన్నారు. మూడవ రోజు గో పూజా కార్యక్రమము, శ్రీ పార్వతీ పరమేశ్వరుల మూర్తుల కల్యాణం,శ్రీ సూర్యదేవ పూజ,మహా రుద్రాభిషేకం,సా: సుందరాకాండ పారాయణం, మంత్రపుష్పం,మహా హారతి తో పూర్తి కార్యక్రమము ముగిసింది... సుమారు 550 మంది భక్తులు పైగా పాల్గొన్నారు... ఈ పవిత్ర వేడుకలో లెజెండ్ విల్లా లో ఉండే స్వామి వారి చిరకాల భక్తులు శ్రీ మధన్ మోహన్ రావు గారు పూర్తి సహకారం అందించారు. SSSSO రాష్ట్ర అధ్యక్షులు వారు శ్రీ.P. వెంకట్ రావు గారు,వివిధ జిల్లా అధ్యక్షులు వారు,రాష్ట్ర సమన్వయకర్తలు,సమితి కన్వీనర్ లు సంస్థ పెద్దలు, భక్తులు,సభ్యులు అనేక మంది పాల్గొని భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందుకున్నామని ఎంతో సంతోషము వ్యక్త పరిచారు.. స్వామి వారు పరిపూర్ణ దివ్య అనుగ్రహం,ఆశీస్సులు గా వారి చిత్ర పటము నుండి రెండు రోజులు వరుసగా ప్రేమతో అమృత దారలు తో ఆశీర్వ దించారు... ఈ మూడురోజులు ప్రతి రోజు సుమారు 6 గంటల పైగా జరిగిన నామ సంకీర్తన,సత్సంగం,పూజా వేడుక లో భక్తులు తన్మయం చెందినారు.. స్వామి వారి పై భక్తి విశ్వాసముతో చేసిన ఈ పవిత్ర వేడుకలో భక్తుల ఆనందమును,ప్రేమను, స్వామి వారు ప్రేమతో స్వీకరించి వారి ప్రేమ బిందువులు శ్రీ సత్యసాయి దివ్య లీలామృతము రూపము లో ప్రతి ఒక్కరినీ అనుగ్రహించి, ఆశీర్వదించారు. ఈ పవిత్ర వేడుకలో పాల్గొన్న పండిత బ్రహ్మలు 27 మందిని సత్కరించి చిరు ప్రసాదం అందించి వేడుక ముగించటమైనది... స్వామి వారి శత జన్మదిన వేడుకలు జరుగుతున్న ఈ పవిత్ర సమయములో స్వామి వారు దయతో వారు అధ్యక్షతన జరుగుతున్న శ్రీ సనాతన భాగవత భక్త సమాజం వారి భృంద సభ్యులచే 385 వ వేడుక మన రంగారెడ్డి జిల్లా లో ప్రేమతో అవకాశమిచ్చి ,ఆనందముగా మనలో,మనతో ఉండి చేయించి,అనుగ్రహించి,ఆశీర్వదించిన బంగారు తండ్రి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణములకు అనంత కోటి వందనములు సమర్పిస్తూ , ప్రత్యక్షంగా,పరోక్షంగా,పాల్గొని,సహకరించి అన్ని విధాలుగా తోడుగా ఉన్న,శ్రీ సనాతన భక్త సమాజ భృంధము వారికి మరియు, ప్రతి సమితి పెద్దలు, సాయి బంధువు లకు, సంస్థ పెద్దలకు,కిచెన్ టీమ్ సభ్యులకు,మహిళా సభ్యులకు హృదయ పూర్వక సాయిరాం ధన్యవాదములు సాయిరాం🙏🙏 సదా సాయి సేవలో అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా , తెలంగాణ