Service

శ్రీ సత్య సాయి సేవా సమితి - అల్వాల్ మేడ్చల్ - మల్కాజగిరి జిల్లా ( తేదీ: 20.04.2023 గురువారం ) సకలజనులలో సర్వేశ్వరుడైన సాయీశ్వరుని సేవించుటే కదా.. జల సేవయే సాయి జనార్ధుని సేవ. భానుడి భగభగలతో వేడిగాలులు వీస్తుండటంతో వడగాడ్పుల్లోనూ తప్పనిసరి పరిస్ధితుల్లో ప్రయాణిస్తున్న చిన్నారులకు, యువకులకు,నడి వయస్సున్నావాళ్ళు మరియు వృద్ధులకు సమితి భక్తులు లోతుకుంట బస్సు స్టాప్ వద్ద శ్రీ సత్య సాయి సేవా శిబిరం యందు చలివేంద్రములో మంచినీరు ఇచ్చి దాహార్తిని తీరుస్తూ వడగాలి తగలకుండా చల్లని మజ్జిగను అందించిగా …వారి నిష్కామ సేవలతో జనులకు ఉపశమనం కలిగిస్తుంటే సేదతీరిన మనస్సుతో జనునులు వారి వారి విధులకు నూతన ఉత్సాహముతో వెళ్లడం గమనిస్తుంటే ఇటువంటి సేవలు చేసుకునే అదృష్టం మరియు అవకాశం ఒక్క సత్య సాయి సేవా సంస్థల ద్వారానే దక్కుతున్నదని సేవాదళ్ సభ్యులు మిక్కిలి సంతోషాన్ని తెలియజేయడం గమనాహారం. సేవాదళ్ సభ్యుల నిష్కామ సేవలకు స్వామి వారు మెచ్చి మిక్కిలి సంతోషించి అనుగ్రహింతురని ఆశీస్తూ.. సదా సాయి సేవలో జె ఈశ్వర్ రావు , కన్వీనర్