Balvikas

శ్రీ సత్య సాయి సేవా సమితి - అల్వాల్ మేడ్చల్ - మల్కాజగిరి జిల్లా ( తేదీ: 20.04.2023 గురువారం ) బాలవికాస్ వేసవి కాలం శిక్షణ శిభిరం ప్రతి సంవత్సరం వేసవి కాలములో ఆల్వాల్ పట్టణ పరిధిలోని చిన్నారులైన బాల బాలికలకు పాఠశాల వేసవి సెలవులు సద్వినియోగించుకునేలా పిల్లల వ్యక్తిత్వాన్ని వికాసానికి తీర్చిదిద్దడంతోపాటు భారతీయ సామజిక సంప్రదాయం , విలువలతో కూడిన సంప్రదాయ క్రీడల్లో తర్పీదు , మేధస్సును పెంపొందించే శిక్షణ ఇవ్వడానికి ఈ సంవత్సరం బాల్వికాస్ గురువులు మరియు సమితి యువత నడుం బిగించి తేదీ : 30.04.2023 నుంచి పదిహేను రోజులు పాటు అల్వాల్ శ్రీ సత్య సాయి సేవా మందిరం లో వేసవి శిక్షణ శిభిరం ఏర్పాటు చేస్తునందుకు అభినందిస్తూ ఆనందిస్తూ తెలిజేస్తున్నాము. కావున సాయి కుటుంబ సభ్యులు మరియు సేవాదళ్ సభ్యులు తమవంతుగా వ్యక్తిగతముగా సమితి బాలవికాస్ గురువులకు మరియు యువతకు ( మన పిల్లలే ) పెద్దమనసుతో సమయముతో పాటు మానసిక తోడ్పాటు సేవలందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సదా సాయి సేవలో జె ఈశ్వర్ రావు కన్వీనర్