ఓం శ్రీ సాయిరాం. స్వామి వారి అనంతమైన దయ వలన, ప్రశాంతి నిలయంలో శ్రీవారి దివ్య సన్నిధి లో అఖిల భారత మహిళా సాధనా శిబిరంలో తెలంగాణ రాష్ట్రము నుండి వందలాది ప్రతినిధులు, సేవాదళ్ సభ్యులు పాల్గొనటం భగవానుని కృపా విశేషం. శ్రీవారి దివ్య సన్నిధిలో జరిగిన కార్యక్రమములో మన సోదరీమణులు వేద పఠనం, భజన నిర్వహించడముతో పాటు, 16 మంది ట్రైబల్ సోదరీమణులు తమ సంప్రదాయ దుస్తులలో స్వామి వారి సన్నిధిలో అంజలి ఘటించే భాగ్యం కలగడం చాలా ఆనందదాయకం. ఈ అవకాశాలతో బాటు ఈ జాతీయ సదస్సులో వక్తలుగా పాల్గొని స్వామి వారి దివ్య సందేశాన్ని , సంస్థలలో పాటించవలసిన నిబంధనలను ప్రతినిధులకు వివరించే భాగ్యం కూడా వరించడం విశేషం. మహిళా విభాగం వారికి స్వామి వారి పై ఉన్న ప్రేమకు, శ్రీవారు తెలంగాణ పై కురిపిస్తున్న అవ్యాజ కరుణకు నిదర్శనంగా దీనిని భావిస్తు మరింత నిబద్దతతో, భక్తి శ్రద్ధలతో శ్రీవారి శత జయంతి వేడుకల లో అందరం కలసి పాల్గొని స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా పొందుదాం. జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర మరియు జిల్లా బాధ్యులకు, మహిళా విభాగం బాధ్యులకు, మహిళా సభ్యులకు హార్దిక అభినందనలు. సదా సాయి సేవలో, పి. వెంకట్రావు, రాష్ట్ర అధ్యక్షులు.