🙏ఓం శ్రీ సాయిరాం🙏 స్వామి వారి అనంతమైన దయ వలన శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో దశాబ్దములుగా అందించిన సేవలకు గుర్తుగా ప్రశాంతి నిలయంలో శ్రీవారి దివ్య సన్నిధిలో అఖిల భారత మహిళా సాధనా శిబిరంలో తెలంగాణ రాష్ట్రము నుండి శ్రీమతి చక్రవర్తి జయంతి గారు, శ్రీమతి కోటగిరి సుధ గారు మరియు శ్రీమతి లావణ్య సరస్వతి గార్లకు శ్రీవారి ఆశీస్సులు , సముచిత రీతిలో సత్కారం లభించడం యావత్తు తెలంగాణ లో అందరికీ గర్వకారణం. ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు అని త్యాగరాజు వారు అన్నట్టు, సంస్థకు తమ సర్వస్వాన్ని అంకితం చేసి, కాయమును, కాలమును సార్థకం చేసుకున్న ఎందరో ధన్య జీవుల తరపున వీరు ప్రతినిధులని చెప్పవచ్చు. శ్రీవారు తెలంగాణపై కురిపిస్తున్న అవ్యాజ కరుణకు నిదర్శనంగా దీనిని భావిస్తు మరింత నిబద్దతతో, భక్తి శ్రద్ధలతో శ్రీవారి శత జయంతి వేడుకలలో అందరం కలసి పాల్గొని స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా పొందుదాం. సదా సాయి సేవలో, పి. వెంకట్రావు, రాష్ట్ర అధ్యక్షులు.