ఓం శ్రీ సాయిరాం. శివం మందిరం ఈవత్సర స్వర్ణోత్సవ, వేడుకలలోభాగంగా, ఫిబ్రవరి 5, 2023, మాఘపౌర్ణమి, ఆదివారం ఉదయం 8.00 గం||ల||నుండి,ఫిబ్రవరి 12,2023,ఆదివారం ఉదయం 8.00 గం||లకు మహా మంగళహారతి స్వామికి సమర్పించి,భజన సప్తాహమును (24 /7 రోజుల అఖండ నామ భజన) ఆ గానలోలుని పదకమలముల చెంత,భక్తితో సమర్పించుకుందాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా,31 జిల్లాల లోని సాయి కుటుంబ సభ్యులు అందరూ,ఈ పవిత్రమైన నామ యజ్ఞములో పాల్గొని,స్వామి వారి ఆశీస్సులు పొందుడని,అందరినీ ఆత్మీయ పూర్వకముగా శివం మందిరమునకు ఆహ్వానిస్తున్నాము . జై సాయిరాం. శ్రీ సత్య సాయి సేవా సంస్థలు,హైదరాబాద్, జిల్లా అధ్యక్షులు, మరియు సభ్యులు.